జగన్ అమోల్ బేబీ అయితే… లోకేష్ హెరిటేజ్ దున్నపోతా? : ఏపీ మంత్రి

ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టిడిపిపై నిప్పులు చెరిగారు. కరోనా కాలంలోనూ పోలవరం పనులు ప్రణాళికాబద్ధంగా చేస్తున్నామని.. వైఎస్ బీజం వేసిన ప్రాజెక్టును ఆయన తనయుడు జగన్ పూర్తి చేస్తుంటే.. టీడీపీ నాయకులు చూడలేక పోతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. లోకేష్ ఫ్రస్టేషన్ పీక్స్ లో ఉందని.. ఎమ్మెల్యేగా గెలవలేకపోయా అనే ఆందోళన కనబడుతున్నారు. ముఖ్యమంత్రిని తిట్టి పెద్ద నాయకుడిని అయిపోయానని ఫీలవుతున్నాడని చురకలు అంటించారు మంత్రి అనిల్ కుమార్.

డిపాజిట్ కూడా తెచ్చుకోలేని లోకేష్ కు జగన్ గురించి మాట్లాడే స్థాయి ఉందా? అని ప్రశ్నించారు. జగన్ అమోల్ బేబీ అయితే… లోకేష్ హెరిటేజ్ దున్నపోతా? భాష మాకు కూడా వచ్చు అని హెచ్చరించారు. నాయకత్వ లక్షణాలు రక్తంలో ఉంటాయి…నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడం కాదన్నారు. దేశ ప్రజలు ఇప్పటికే పప్పు నాయుడు అని పేరు పెట్టారని.. ఈ రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్ కు పని అయిపోయిందని ఎద్దేవా చేశారు.