హైకోర్టు సీరియస్.. దిగివచ్చిన జగన్ సర్కార్!

ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై హై కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో వృద్ధులకు 2 రోజుల్లో వ్యాక్సిన్ వేయాలని జగన్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ లేకపోవటం వల్ల వృద్ధులకు వ్యాక్సిన్ వేయటం లేదన్న సుమోటో పిటిషన్ పై హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. అయితే హైకోర్టులో విచారణ సందర్భంగా మెమో దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం.. రెండ్రోజుల్లో వృద్ధులకు వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని స్పష్టం చేసింది.

సోమవారం నాటికి సీనియర్ సిటీజన్స్ కి వ్యాక్సిన్ వేసామని ప్రభుత్వం పేర్కొంది. మీడియాలో వచ్చిన వార్తలను కోర్టు దృష్టికి అమికస్ క్యూరీ తెచ్చింది. అయితే దీని పై తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. మొదట్లో 20 వేలకు పైగా కేసులు నమోదు కాగా ఇప్పుడు 10 వేలకు లోపే నమోదవుతున్నాయి.