అరదుగా ఉండే కాశీ విశ్వనాథుని ఆలయాన్ని బోడుప్పల్ ప్రాంతంలో నిర్మించిన ధర్మకర్తలకు, కాలనీ ప్రజలకు నా అభినందనలు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా సుఖశాంతులతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీ అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి వారిని ప్రార్ధించడం జరిగింది. వచ్చే 18 నెలల్లో ఉప్పల్ ఘట్ కేసర్ ఫ్లైఓవర్ పనులను పూర్తి చేసి బోడుప్పల్ ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తాం. హైదరాబాదులో నిరుపేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేయక దాదాపు దశాబ్దం గడిచిపోయింది.. ప్రజా ప్రభుత్వంలో నిరుపేదలకు ఇల్లు కట్టించే అందిస్తాం.
ఇవే కాదు మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి నిరుపేదలకు అండగా నిలుస్తాం అన్నారు. అలాగే మాది సెక్యూలర్ ప్రభుత్వం…మాకు అన్ని పండుగలు సమానమే. ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టేది బీజేపీ.. మా గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు. రాష్ట్రంలో 20 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. బీసీనీ సీఎం చేస్తా అంటున్న బీజేపీ.. ఓ బీసీ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే పీకేసింది. దళితుడిని సీఎం చేస్తా అంటేనే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు ఓటేసి.. అధికారంలోకి తీసుకువచ్చారు అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.