బ్రేకింగ్:ఏపీలో ఇంటర్ పరిక్షలపై మంత్రి క్లారిటీ…!

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరిక్షలకు సంబంధించి పదో తరగతి పరిక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ముందుకు వెళ్తుంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆగడం లేదు. తాజాగా మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. పరిక్షలకు సిద్దం కావాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని ఆయన మీడియాకు వివరించారు.

మే 5 నుంచి షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరిక్షల నిర్వహణ ఉంటుందని అన్నారు. మే 5 నుంచి 23 వరకు ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ పరిక్షలు ఉంటాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1400 కేంద్రాలు ఏర్పాటు చేసామని ఒక్కో సెంటర్ కు ఒక్కో కోవిడ్ ప్రోటో కాల్ మంత్రిని సిద్దంగా ఉంచామని ఆయన చెప్పారు. పరిక్షల మేటిరియల్ పరిక్షల సెంటర్ లకు చేరుకున్నాయని అన్నారు.