మంత్రి గంగుల కమలాకర్ నేడు కేబుల్ బ్రిడ్జి వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కేబుల్ బ్రిడ్జిపై నిర్వహించనున్న ‘వీకెండ్ మస్తి’ సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి పేర్కొన్నారు. దీనికి ముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మేయర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఇతర అధికారులతో కార్యక్రమం ఏర్పాట్లపై సమీక్షించారు. కేబుల్ బ్రిడ్జి పై శని, ఆదివారాల్లో వీకెండ్ మస్తి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు మంత్రి గంగుల.
కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం రోజున నిర్వహించిన కార్యక్రమాలను మరిపించేలా.. ప్రజలకు ఆనందంతో పాటు ఉత్సాహాన్ని కలిగించేలా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఫుడ్ స్టాళ్లు ఇతర ఏర్పాట్లు జరగాలని ఆదేశించారు ఆయన. అంతేకాక పరిశుభ్రతకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు మంత్రి గంగుల. స్టాళ్లను ఏర్పాటు చేసిన చోట, ఇతర ప్రాంతాల్లో చెత్తబుట్టలను కూడా పెట్టాలని సూచించారు, ఫుడ్ స్టాల్స్ ఖచ్చితమైన నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చూడాలన్నారు ఆయన . స్టాల్స్ ఏర్పాటుకు ఎలాంటి ఫీజును వసూలు చేయొద్దన్నారు.