మంత్రి గంగుల కమలాకర్ కు ఇటీవల ఈడీ నోటీసులు పంపించిందంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గంగుల కమలాకర్ సోదరులను అరెస్ట్ చేస్తామని నకిలీ ఈడి నోటీస్ ను ఆగంతకులు పంపించారు. ఒక వేళ అరెస్ట్ వద్దనుకుంటే ఈడీతో మాట్లాడి సెటిల్ మెంట్ చేసుకోవాలని నోటీసుల సారాంశం. ఇటీవల నోటీసులు రావడంతో ఈ వార్త రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. దాంతో గంగుల కమలాకర్ ఈడీ అధికారులను సంప్రదించారు.
దాంతో అవి నకిలీ నోటీసులని తేలింది. కాగా నకిలీ ఈడి నోటీసుపై ఈడీ అధికారులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అగంతకుల పై 420, 468, 471 సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తు లో భాగంగా గంగుల కు సైబర్ క్రైమ్ పోలీసులు ఫోన్ చేశారు. అయితే గంగుల కమలాకర్ మాత్రం ఇప్పటి వరకు తనకు అందిన నోటీసుల పై ఎలాంటి షిర్యాదు కూడా చేయలేదు.