చైనాలో పురుడు పోసుకున్న కరుణ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కరోనా మహమ్మారి కారణంగా మన దేశం లోని… అనేక రంగాలు మొదలయ్యాయి. ఇక ఇప్పుడు ఇప్పుడే సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యం లో…. కరోనా కేసులు మళ్లీ పెరుగు తున్నాయి. ఈ నేపథ్యం లో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది.
భారతదేశంలో కరోనా మహమ్మారి ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతోందని పేర్కొంది. మరికొన్ని రోజులు తర్వాత తీవ్రత ఇలానే ఉండే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. పిల్లలకు కరోనా వచ్చిన వ్యాధి తీవ్రత అతి స్వల్పమే నని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. తక్కువ శాతం మంది చిన్నారులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. కాగా భారత్ లో కొత్తగా 37, 593 కరోనా కేసులు పాజిటివ్ కాగా 648 మరణాలు చోటు చేసుకున్నాయి.