మంత్రి గంగుల‌కు వ‌ర్గం ఉండ‌ద‌ట‌.. అంతా టీఆర్ ఎస్ వ‌ర్గ‌మే అంటూ కామెంట్లు!

-

మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఇప్పుడు టీఆర్ ఎస్‌లో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈట‌ల‌ను ఒంటరి చేసే బాధ్య‌త‌ల‌ను గంగుల‌కు అప్ప‌గించ‌డంతో ఫుల్ జోష్‌తో ప‌నిచేస్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు ప్రెస్‌మీట్లు పెట్టి మ‌రీ ఈట‌ల‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అయితే ఈట‌ల కూడా ఈయ‌న ఆరోప‌ణ‌ల‌కు గ‌ట్టి కౌంట‌రే వేస్తున్నాడు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మ‌రోసారి గంగుల సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఈట‌ల రాజేంద‌ర్ త‌న‌పై చేస్తున్న ఆరోప‌ణ‌లు కరెక్టు కాద‌ని, త‌న‌కు సొంత వ‌ర్గం లేదంటూ చెప్పుకొచ్చారు.

హుజూరాబాద్ నాయకులను ప్రజాప్రతినిధులకు డబ్బులు ఇచ్చి కొంటున్నారన్న ఈటల ఆరోప‌ణ‌లు బాధాకరమని మంత్రి గంగుల చెప్పారు. టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎవ్వరూ అమ్ముడుపోరని.. గంగులకు వర్గం ఉండదు అందరూ టీఆర్ఎస్ వర్గం వాళ్లే అంటూ తేల్చి చెప్పారు. ఎప్పుడైతే ఈటల కాంగ్రెస్, బీజేపీ నేత‌ల‌ను క‌లిశాడో అప్పుడే టీఆర్ ఎస్ కేడ‌ర్ ఈట‌ల‌ను వ‌దిలేసింద‌న్నారు. అందుకే వారంతా టీఆర్ ఎస్ వెంటే ఉంటామని స్ప‌ష్టం చేశారని వివ‌రించారు.

Read more RELATED
Recommended to you

Latest news