కరోనా వైరస్ తో మృతి చెందిన వారి నుండి కూడా వైరస్ సోకుతుందా..?

-

కరోనా మహమ్మారి ఎందరో మందిని బాధిస్తోంది. ఇటువంటి సమయం లో జాగ్రత్తగా ఉండాలి. కరోనా కారణంగా చాలా మంది మృతి చెందారు. కరోనా వైరస్ నాజర్ మరియు ఓరల్ కెవిటీస్ లో యాక్టివ్ గా ఉండదు. చనిపోయిన 12 నుండి 24 గంటలు తరువాత చాలా తక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

డిపార్ట్మెంట్ అఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ AIIMS పోస్టుమార్టం చేసిన వంద బాడీలను తీసుకుని రీసెర్చ్ చేయడం జరిగింది. మృతి చెందిన 12 నుంచి 24 గంటల మధ్య లో చెక్ చేస్తే నెగిటివ్ వచ్చింది అని తేలింది. అయితే సురక్షితంగా ఉండటం కోసం నాజర్ మరియు ఓరల్ కెవిటీస్ ని క్లోస్ చేయాలని.. అప్పుడు ఎటువంటి ఫ్లూయిడ్స్ కూడా రావని అన్నారు.

అదే విధంగా ఎవరైతే ఆ బాడీలని తీసుకుని వెళుతున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని.. మాస్క్, గ్లవుజులు, పీపీఈ కిట్స్ ధరించాలని అన్నారు. అయితే ఎముకలు మరియు బూడిద కలెక్ట్ చేయడం సురక్షితమని ఇందులో ఎటువంటి రిస్క్ లేదని అన్నారు.

కాబట్టి ఇందులో ఎటువంటి భయం లేదు. పోస్టుమార్టం చేసేటప్పుడు మాత్రం చాలా స్ట్రిక్ట్ గా పాటించాలని.. బాడీ నుండి వచ్చే ఫ్లూయిడ్స్ కారణంగా కరోనా బారిన పడే అవకాశం ఉంది కాబట్టి బాడీ తీసుకెళ్లే వాళ్లు మరియు డాక్టర్లు కూడా పోస్టుమార్టం టైంలో వీలైనంత జాగ్రత్తగా ఉండటం మంచిదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news