కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిందే: హరీష్ క్లారిటీ

-

జీఎస్టీ నిధుల విషయంలో తెలంగాణా సర్కార్ వెనక్కు తగ్గడం లేదు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను ఇవ్వాల్సిందే అని పట్టుబడుతుంది. తాజాగా జీఎస్టీ సమావేశంలో మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. జీఎస్టీ పరిహారం మొత్తం కేంద్రమే చెల్లించాలి అని ఆయన డిమాండ్ చేసారు. పరిహారం పోందడం రాష్ట్రాల చట్టబద్ధమైన హక్కు అని ఆయన వ్యాఖ్యానించారు. ఐజీఎస్టీ కింద‌ రాష్ట్రాలకు రావాల్సిన మొత్తం వెంటనే చెల్లించాలన్నారు.

ఈ ఏడాది ఆరు నెలల సెస్ వసూలు‌ చేశారని అన్నారు. కేంద్రం రాష్ట్రాలకు చెల్లించాల్సిన మూడు ఇన్‌స్టాల్ మెంట్స్ పెండింగ్‌లో ఉన్నాయన్న ఆయన.. ఈ మొత్తం రాష్ట్రాలకు వెంటనే పంచాలని కోరారు. కోవిడ్ పరిస్థితుల్లో ఈ మొత్తం రాష్ట్రాలకు అత్యంత అవసరమని అన్నారు హరీష్. కేంద్రమే జీఎస్టీ పరిహారం మొత్తం అప్పు తీసుకుని రాష్ట్రాలకు చెల్లించాలని డిమాండ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news