ముంపు ప్రాంతాల్లో హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలి : హరీష్‌రావు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, వరద ప్రభావిత, ముంపు ప్రాంతాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, డాక్టర్లతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శి ఎస్.ఏ.ఏం రిజ్వీ ఉన్నారు. వరద, ముంపుకు గురైన గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ముంపు గ్రామాల్లో హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. వైద్యులు సెలవులు తీసుకోకుండా, తప్పనిసరిగా విధులకు హాజరయి ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపుల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

Harish Rao has no other choice but to endure the invisibility cloak by KCR

అవసరమైన మందులను ప్రజలకు అందుబాటులో ఉంచి సరఫరాచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రజా ఆరోగ్యం సంచాలకులు శ్రీనివాసరావును కొత్తగూడెం కేంద్రంగా, వైద్య విద్య సంచాలకులు రమేశ్ రెడ్డిని మంచిర్యాల కేంద్రంగా విధులు నిర్వహిస్తూ హెల్త్ క్యాంపులు తదితర ప్రజా ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొనాలని, అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. అయితే రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ పర్యటించనున్న ప్రాంతాల్లోని అధికారులు అప్రమత్తమయ్యారు.