సిద్దిపేటలో మనకు ఏపార్టీ తో పోటీ లేదు : హరీశ్‌ రావు

-

‘చేసింది చెపుదాం.. సిద్దిపేట ప్రజల గౌరవాన్ని నిలబెడుదాం. ప్రజలు కోరే అభివృద్ధి చేసుకున్నాం. ప్రేమతో ప్రజలను ఓటు అడిగి మేనిఫెస్టోను’ వివరించాలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గం స్తాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. అభివృద్ధి అంటే సిద్దిపేట నేనా అన్న ప్రతిపక్షాలు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతాయని ప్రశ్నించారు. అభివృద్ధిని ఓర్వ లేని మీకు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. సిద్దిపేటలో మనకు ఏపార్టీ తో పోటీ లేదు. మనకు మనకే పోటీ అని స్పష్టం చేశారు. మండలం మండలం పోటీ పడండి. ఎక్కువ శాతం తెచ్చుకున్న మండలానికి బహుమతి ఇస్తానని తెలిపారు. సిద్దిపేట అభివృద్ధిని చూసి నేర్చుకునేలా చేసినం. సిద్దిపేట కార్యకర్తలకు ఎమ్మెల్యే, కార్యకర్త అనుబంధం కాదు. కుటుంబ అనుబంధం మనదని పేర్కొన్నారు.

అంతే కాక , మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని కోడికత్తి అంటూ విపక్షాలు అపహాస్యం చేయడం సరికాదని బీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రజాప్రతినిధిపై దాడి జరిగితే ఖండించాల్సిన ప్రతిపక్షాలు ఇలా మాట్లాడం విడ్డూరమన్నారు. కత్తి దాడితో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డిని హరీశ్ రావు పరామర్శించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version