తెలంగాణలో రేవంత్ అవినీతి కుటుంబ కథా చిత్రం నడుస్తుంది : KTR

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేటీఆర్ వరుస ఆరోపణలు చేసారు. మొత్తం తెలంగాణలో రేవంత్ అవినీతి కుటుంబ కథా చిత్రం నడుస్తుంది అన్నారు. ఈరోజు 8,888 కోట్ల రూపాయల అమృత్ టెండర్ల కుంభకోణం గురించి సాక్షాలతో బయటపెడుతున్నం. ఈ 8, 888 కోట్ల రూపాయల భారీ అవినీతికి రేవంత్ రెడ్డి తెర లేపారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఇంత పెద్ద భారీ కుంభకోణానికి రేవంత్ రెడ్డి పాల్పడ్డారు. తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక శాఖ కేంద్రంగా రేవంత్ రెడ్డి ఈ కుంభకోణాన్ని చేశారు. ఈ భారీ కుంభకోణంతో రేవంత్ రెడ్డి పదవీ కోల్పోయి అవకాశం ఉన్నది.

ముఖ్యమంత్రి బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకున్నా వేలకోట్ల రూపాయలు పనులను కట్టబెట్టారు. ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని పిలిపించి బెదిరించి ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారు. పేరుకే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ అయినా రేవంత్ రెడ్డి బావమరిది కోసం ఈ టెండర్లను కట్టబెట్టారు. ఇందులో టెండర్ దక్కించుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీతో రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీతో జాయింట్ వెంచర్ పేరుతో డ్రామాకి తెరలేపారు. 1137 కోట్ల రూపాయల కాంట్రాక్టు గెలుచుకున్న తర్వాత ఆ కంపెనీ 20 శాతం పని చేస్తుంది అంట. ముఖ్యమంత్రి బావమరిది కంపెనీ మాత్రం 80% వెయ్యి కోట్ల పని చేస్తుంది అంట. ముఖ్యమంత్రి స్వయంగా అధికారుల పైన ఒత్తిడి తీసుకువచ్చి ఈ కాంట్రాక్టులు కట్టబెట్టారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టం, అవినీతి నిరోధక చట్టం 7,11,13 నిబంధనల మేరకు రేవంత్ రెడ్డి విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. రేవంత్ పదవి కొల్పోతారు. తన కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరిస్తే ఆశ్రితపక్షపాతం చూపిస్తే ఈ చట్టం ప్రకారం శిక్షార్హులు అని కేటీఆర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version