వ్యక్తిగత పరిశుభ్రత శ్రీరామరక్ష: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రత పాటించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. ప్రతి ఆదివారం ‘పది గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో పరిసరాలను శుభ్రం చేశారు.

Minister Indra Karan Reddy
Minister Indra Karan Reddy

వర్షాకాలంలో వచ్చే డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు… ప్రతి ఆదివారం ‘పది గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో పరిసరాలు, ఫొటోలను శుభ్రం చేశారు.ప్రజలు, ప్రజాప్రతినిధులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములుకావాలని కోరారు. కరోనా నేపథ్యంలో పాటిస్తూన్న వ్యక్తిగత పరిశుభ్రతను ఇక ముందు కూడా కొనసాగించాలన్నారు. కరోనా కేసులు పెగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేస్తున్నారు.