భీమ్లా నాయక్ సినిమా పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తల్లి లాంటి సినిమాను పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని నిప్పులు చెరిగారు మంత్రి కొడాలి నాని. అఖండ, బంగార్రాజు సినిమాలు ఎంతో తమకు భీమ్లా నాయక్ సినిమా కూడా అంతేనని కొడాలి నాని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 25వ తేదీన టికెట్ల రేట్లు మేము పెంచుతామని చెప్పామా అని నిలదీశారు.
మెగాస్టార్ చిరంజీవి ని పవన్ కళ్యాణ్ అవమానించ వచ్చా ? సీఎం జగన్ వద్ద వంగి వంగి దండాలు పెడతారని చిరంజీవిని అంటారా ? అని పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు కొడాలి నాని. సీఎం అంటే రాష్ట్రానికి పెద్ద… అందుకే చిరంజీవి జగన్ ను గౌరవించాలని స్పష్టం చేశారు. కానీ దీనిపై అనవసరంగా … రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో 350 టిక్కేట్టు వుంటే…. ఏపిలో 150 కే పవన్ కళ్యాణ్ అభిమానులుకు టిక్కేట్టు లభించిందని ఎద్దేవా చేశారు రోజా. గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం కారణంగానే సినిమా టిక్కేట్ల ధరల పెంపు అంశం పై తమ ప్రభుత్వం తుది నిర్ణయం వాయిదా వేసుకుందని గుర్తు చేశారు.