ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం మండలం సిరికొండ, మద్దునూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద యాత్ర లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ మంత్రి మాట్లాడుతూ,
ఐదు దశాబ్దాల పాలనలో వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసి, రైతులను గోసపెట్టిన కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఓటేస్తే చీకటి రోజులే వస్తాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో కరెంటు, ఎరువులు, నీళ్లు ఇవ్వకుండా, ప్రాజెక్టులు కట్టకుండా, చెరువులు బాగుచేయకుండా వ్యవసాయాన్ని అధోగతి పాలు చేసి, రైతన్నల ఆత్మహత్యలకు కారణమైందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మద్దునూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభం, శంకుస్థాపన చేశారు మంత్రి కొప్పుల. అక్కడ ఆయన ప్రసంగిస్తూ ఇప్పుడిప్పుడే కుదటపడుతున్న తెలంగాణ రైతుల కడుపులు కొట్టేవిధంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న వ్యాఖ్యలపై రైతులకు కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు.