తెలంగాణలో వారికి గుడ్‌న్యూస్‌.. రెండో విడుత డబుల్‌ బెడ్‌రూంల పంపిణీ

-

ఈ నెల 21న హైదరాబాద్‌లో రెండో విడుత డబుల్‌ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. హైదరాబాద్‌ నగరంలో డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీపై మంత్రి కేటీఆర్‌ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మహబూద్‌ అలీ, మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న హైదరాబాద్‌ రెండో దశలో దాదాపు 13,300 ఇండ్లను అందించేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపికలో ఎవరి ప్రమేయం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులను ఎంపికను ప్రభుత్వ అధికారులకే అప్పగించామని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికకు కంప్యూటర్‌ ఆధారిత డ్రా తీస్తున్నట్లు చెప్పారు. ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మీడియా ముందు నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలో హైదరాబాద్‌లో గృహలక్ష్మి పథకం ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా ఇళ్ల స్థలాలు ఉన్న వారికి ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.3లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. అయితే హైదరాబాద్ నగరంలో గృహలక్ష్మి కార్యక్రమానికి కొన్ని మార్పు చేర్పులు చేయాలని మంత్రులు సీఎం కేసీఆర్‌ను కోరారని చెప్పారు. వారు సూచించిన మార్పులకు సీఎం కేసీఆర్ సూచనప్రాయంగా అంగీకరించారని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version