తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ లేదా.. నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కాగ నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో #AskKTR అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ #AskKTR కార్యక్రమంలో ఒక నెటిజన్ రాష్ట్రంలో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తారా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు అవడం దాని పై లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అలాగే రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచనల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అలాగే #AskKTR ద్వారా నెటిజన్లు అడిగిన మరి కొన్ని ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలు తెలిపారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్తారా అనే ప్రశ్నకు.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం ఎలా చెప్పగలం అని అన్నారు.
అలాగే యూపీ ఎన్నికల్లో ఎస్పీకి మద్దతుగా ప్రచారం చేస్తారా అనే ప్రశ్నకు.. యూపీలో ఎస్పీకి అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని అన్నారు. అలాగే యూపీ ఎన్నికల్లో ప్రచారం అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
Signing off Guys from #AskKTR
Wish you all a Happy Sankranthi
— KTR (@KTRTRS) January 13, 2022