బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించిన తొలి జాబితాపై అమెరికాలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్విటర్ వేదికగా స్పందించారు. జాబితాలో పేర్లు ఉన్న అభ్యర్థులందరికీ అభినందనలు తెలిపారు. టికెట్లు దక్కనివారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. చాలా సామర్థ్యం, అర్హత ఉన్నకొందరికి సీట్లు దక్కకపోవడంపట్ల కేటీఆర్ నిరాశ వ్యక్తం చేశారు.
ఇక ప్రజా జీవితంలో నిరాశ, నిస్పృహాలు ఎదురవుతాయి. సామర్థ్యం కలిగిన కొంత మంది నాయకులకు దురదృష్టవశాత్తూ టికెట్లు లభించలేదు. ఉదాహరణకు క్రిశాంక్‌తో పాటు అలాంటి కొంత మంది నాయకులకు అవకాశం రాలేదు. వీరందరికి ప్రజలకు సేవ చేసేందుకు మరొక రూపంలో అవకాశం ఇస్తామని కేటీఆర్ ప్రకటించారు. తనను మళ్లీ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేట్ చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.