గుండె పోటుతో హఠాన్మరణం చెందిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్య క్రియలు నేడు జరగనున్నాయి. ఇప్పటి వరకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని అభిమానులు, వైసీపీ కార్యకర్తల సందర్శన కోసం ఉంచారు. నేడు మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలను నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో మంత్రి గౌతమ్ రెడ్డి అంత్య క్రియలను నిర్వహించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మంత్రి గౌతమ్ రెడ్డి అంతిమ యాత్ర.. ఉదయం 6 గంటలకే ప్రారంభం కానుంది. నెల్లూరులోని మేకపాటి గౌతమ్ రెడ్డి నివాసం నుంచి జొన్నవాడ మీదుగా బుచ్చి, సంగం, నెల్లూరు పాలెం, మర్రి పాడు, బద్వెలు, బ్రాహ్మణ పల్లి, కృష్ణాపురం, నందిపాడు గ్రామాల మీదుగా గౌతమ్ రెడ్డి భౌతిక కాయం అంతిమ యాత్ర జరగనుంది.
ఉదయగిరిలోని మేకపాటి రాజ మోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ అవరణలో ఉదయం 11:30 గంటలకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్య క్రియలు జరగనున్నాయి. ఈ అంత్య క్రియలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి తో పాటు.. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా హాజరు కానున్నారు.