రైస్ మిల్లుల గోడౌన్ లలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. కాకినాడ సిటీ, రూరల్, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని 10 రైస్ మిల్లుల గోడౌన్ లలో తనిఖీలు నిర్వహించారు.అక్రమ బియ్యం వ్యాపారం తారస్థాయికి చేరిందని ,అక్రమ బియ్యం వ్యాపారంలో కొంతమంది అధికారుల సహకారం ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని మంత్రి మనోహర్ వెల్లడించారు.
ఈ రైస్ మిల్లుల వెనకాల చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అందరూ బయటకు వస్తారు. ఒక కుటుంబం బాగుపడడం కోసం పేదలకు అన్యాయం చేశారు.రైస్ మిల్లుల అక్రమాల వెనక ద్వారంపూడి అనుచరులు ఉన్నారని ఆరోపించారు. తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని.. ప్రతి ఒక్కరిపై 6ఏ కేసులు నమోదు చేస్తామన్నారు మంత్రి మనోహర్. ఈ వ్యాపారం చేసే వాళ్లు సముద్రంలో వెసలు కొనే స్థాయికి వచ్చారు” అని మంత్రి అన్నారు.