విజయవాడలో ఆప్కో ఎగ్జిబిషన్ షోరూమ్ ను ప్రారంభించిన మంత్రి రోజా

-

విజయవాడ లో పిన్నమనేని పాలి క్లినిక్ రోడ్ లో ఆప్కో ఎగ్జిబిషన్ షోరూమ్ ను ప్రారంభించారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి వర్యులు రోజా. ఈ సందర్భంగా షోరూమ్ లో వస్త్రాలను పరిశీలించిన మంత్రి రోజా.. మీడియాతో మాట్లాడారు. సమ్మర్ శారీ మేళా కు నన్ను పిలవటం సంతోషమని.. మహిళలకు నచ్చేలా అన్నీ ఆప్కో షోరూమ్ లలో ఉన్నాయని పేర్కొన్నారు మంత్రి రోజా.

ఆప్కోను అభివృద్ధి చేయండని.. చేనేత కార్మికులకు మనం సహాయం చేస్తేనే వాళ్ళు అభివృద్ధి చెందేదని చెప్పారు. సిఎం చేనేత వాళ్లకు 24,000 ఇస్తున్నారని.. భవిష్యత్తులో అప్కో మరింతా అభివృద్ధి చెందుతుందని చెప్పారు మంత్రి రోజా. చేనేత కుటుంబానికి కోడలిగా ఈ రంగాన్ని ప్రోత్సహించటనికి ముందుంటానని హామీ ఇచ్చారు మంత్రి రోజా. ఆప్కో సంస్థ కు మహిళ(నాగరాణి) మేనేజింగ్ డైరెక్టర్ వుండటం విశేషం అని స్పష్టం చేశారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో ఏపీ అభివృద్ధిలో దూసుకెళుతుందని తెలిపారు మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version