దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల తయారీలో సత్తా చాటుతోంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్ నుంచి టాటా టిగోర్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీని తీసుకువచ్చింది. ఇప్పటికే ఇండియాలో టాటా నెక్సాన్ ఈవీ కార్ల అమ్మకాలు దుమ్ము రేపుతున్నాయి. మార్కెట్ లో ఎంజీ జెడ్ ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా వంటి ఈవీ కార్లు ఉన్నా… టాటా నెక్సాన్ ను ఢీకొట్టలేకపోతున్నాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే విధంగా నెక్సాన్ ఈవీని తీర్చిదిద్దింది టాటా. అయితే ఇతర పోటీ కార్లు దాదాపుగా 400 కిలోమీటర్ల రేంజ్ ఇస్తున్నాయి.
దీంతో టాటా కొత్తగా టాటా నెక్సాన్ ఈవీ మాక్స్ కారునున మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపుగా 437 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే కొత్త కారును తీర్చిదిద్దారు. 40.5 కిలోవాట్అవర్ బ్యాటరీ ప్యాక్ తో నెక్సాన్ ఈవీ మాక్స్ రానుంది. గతంలో ఉన్న నెక్సాన్ ఈవీతో పోలిస్తే ఈవీ మాక్స్ లో బ్యాటరీ సామర్థ్యంతో వస్తోంది. దీంతో పాటు ట్రాక్షన్ కంట్రోల్, స్టెబిలిటీ, ఎయిర్ ఫ్యూరిఫయర్, క్రూజ్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు నెక్సాన్ ఈవీ మాక్స్ సొంతం. నెక్సాన్ ఈవీ మాక్స్ 105 kW (143 PS) శక్తిని ఉత్పత్తి చేస్తుంది, 250 Nm తక్షణ టార్క్‌ను అందిస్తుంది. దీంతో కేవలం 9 సెకన్లలోపు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.