ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మినీ జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి రోజే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అసలు జాతర కాకపోయినా.. సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు.
మేడారం మినీ జాతరను రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు. సమ్మక్క, సారలమ్మ వనదేవతలను ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఏటూరు నాగారం మండలం కొండాయిలో గోవిందరాజుల దేవదర్శనం చేసుకున్నారు. 4వ తేదీ వరకు జరిగే మేడారం మినీ జాతరకు ఏలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జాతర కోసం 3 కోట్ల 10 లక్షల రూపాయలను మంజూరు చేసిందన్నారు..