తెలంగాణ మంత్రి సీతక్క రేపు రాజస్థాన్ కు వెళ్లనున్నారు. అక్కడ ఉదయ్ పూర్ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రేపటి నుంచి జరుగబోయే చింతన్ శివిర్ లో మంత్రి పాల్గొననున్నారు. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి, అంగన్ వాడి పోషన్ 2.0 పై చర్చించనున్నారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి సీతక్క హాజరు కాబోతున్నారు. శుక్రవారం రాత్రి ఉదయ్ పూర్ కి చేరుకోనున్నారు. శనివారం చింతన్ శివిర్ లో సీతక్క ప్రసంగించనున్నారు. తెలంగాణలో మహిళా శిశు సంక్షేమం కోసం ప్రత్యేకంగా అమలు అవుతున్న పథకాలు, కేంద్రం నుంచి ఆశిస్తున్న సహకారం వంటి అంశాలపై మాట్లాడనున్నారు మంత్రి సీతక్క.