ఉపాధి హామీ పనుల అమలుపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

-

ఉపాధి హామీ పథకంపై పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణాభివృద్ది, పంచాయతీ అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పచ్చదనం, పరిశుభ్రత, ఉపాధి హామీ పనుల అమలుపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. అధికారులు తరచూ గ్రామాల్లో పర్యటించి సమస్యలు లేకుండా చూడాలని అన్నారు. సీజనల్ వ్యాధులను నివారించేలా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు.

సరిగా విధులు నిర్వర్తించని ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి వార్నింగ్ ఇచ్చారు .వనమహోత్సవంలో ఫలసహాయం చేసే మొక్కలను నాటించాలన్నారు. రాష్ట్రంలో 30 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేసేలా ప్రోత్సహించాలని ,ఉపాధి హామీలో వ్యవసాయ అనుబంధం పనులను ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రజలతో పంచాయతీ రాజ్ శాఖకి ఎంతో అనుబంధం ఉంటుందన్నారు. గ్రామాల్లో పచ్చదనం, స్వచ్చదనం పెంచేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు మంత్రి సీతక్క.

Read more RELATED
Recommended to you

Latest news