జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక, ఎమ్మెల్యే సంజయ్ చేరిక విషయమై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఎమ్మె్ల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయంచినట్లు సమాచారం.దీంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ప్రభుత్వ విప్‌లు లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ వెళ్లారు. జీవన్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీసుకునే నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. 2014 నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు జీవన్ రెడ్డి,సంజయ్ లు జగిత్యాల పాలిటిక్స్‌లో ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇదే విషయమై కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశమైన జీవన్ రెడ్డి పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటా అని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.