నోరు అదుపులో పెట్టుకో.. బండిసంజయ్‌ కి తలసాని వార్నింగ్‌

బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మేము మీకంటే ఎక్కువే తిట్టగలమని వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని హుజూరాబాద్ నియోజక వర్గంలో బండి సంజయ్ కరోనా సమయంలో ఎప్పుడైనా పర్యటించావా ? అని నిలదీశారు.
హుజూరాబాద్ లోని TRS పార్టీ కార్యాలయంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

minister talasani srinivas yadav fires on bjp

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్తామని… ప్రజలకు మీరేం చేశారో చెప్పే ధైర్యం BJP నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. గడిచిన 7 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తుందని… పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడమే మీరు చేసిన అభివృద్ధి అని ఫైర్‌ అయ్యారు.

ఓటమి భయంతోనే BJP నేతలు ప్రభ్యత్వం పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని… MP గా వ్యవహరిస్తున్న రాష్ట్ర BJP అధ్యక్షుడు బండి సంజయ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పై చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. ప్రజలు డిసైడ్ అయ్యారు…హుజూరాబాద్ లో TRS అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మంత్రి తలసాని. TRS పార్టీ యే తమకు శ్రీ రామరక్ష అని అన్ని వర్గాల ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఈటల రాజేందర్ చేశానని చెప్తున్న అభివృద్ధి మొత్తం TRS ప్రభుత్వం సహకారం తో ముఖ్యమంత్రి KCR ఆధ్వర్యంలో చేసినవేనని స్పష్టం చేశారు.