హిందూ మతంలోకి ఇండోనేషియా తొలి అధ్యక్షుడి కుమార్తె

-

ఆగ్నేయాసియాలో ముస్లిం మెజారిటీ దేశం ఇండోనేషియా. ప్రపంచంలో అత్యధిక శాతం ముస్లింలు ఉన్న దేశంగా గుర్తింపు పొందింది. అయితే అలాంటి దేశంలో ఆ తొలి అధ్యక్షుడి కుమార్తె ముస్లిం మతం నుంచి హిందూ మతంలోకి ఇటీవల మారారు. ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది. ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్నో కూతురు సుక్మావతి సుకర్నోపుత్రి తాజాగా హిందూ మతాన్ని స్వీకరించారు. తన 70 వ పుట్టిన రోజున తను హిందూ మతంలోకి మారారు. తన భర్త చనిపోయిన తర్వాత నుంచి హిందూ మతంలోకి మారాలనే ఆలోచన ఉన్నట్లు సుక్మావతి వెల్లడించారు. హిందూ మతంలోకి మారడం తన మతస్వేచ్చకు సంబంధించింది అని ఆమె తెలిపారు.

సుక్మావతి ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్నో మూడో కుమార్తె, మాజీ అధ్యక్షురాలు మెగావతి సుకర్నోపుత్రి చెల్లెలుగా దేశంలో ప్రముఖ వ్యక్తిగా ఉన్నారు. కాగా గతంలో ఓ కార్యక్రమంలో ముస్లిం మతాన్ని కించపరిచేలా పద్యాన్ని ఆలపించినట్లు కరుడుగట్టిన ముస్లిం సంఘాలు దైవదూషణ కింద ఫిర్యాదులు చేశాయి. అయితే ఫిర్యాదుపై సుక్మావతి తరువాత క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం ఇండోనేషియాలో మెజారిటీ మతం ఇస్లాం అయినప్పటికీ, చాలా మంది హిందూ ఆచారాలను పాటిస్తూ ఉన్నారు. ఇండోనేషియా దేశ విమానయాన సంస్థ పేరు కూడా గరుడా ఏవిమేషన్ అని పెట్టుకున్నారు. హిందూ దేవుడు విష్ణువు వాహనం అయిన గరుడ పేరుతో ఆదేశ విమానయాన సంస్థ ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news