ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి రెండు రాష్ట్రాల ప్రజలు ఆవేదన చెందుతూ ఉండగా, రాజకీయ నేతలు స్పందిస్తూ కొందరు అరెస్ట్ ను ఖండిస్తుంటే, మరికొందరు ప్రజల సొమ్మును దోచిన వారికి తగిన శిక్ష పడాల్సిందే అంటూ మాట్లాడుతున్నారు. ఇక తాజాగా చూస్తే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. లేటెస్ట్ గా తలసాని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, చంద్రబాబును అరెస్ట్ చేయడం చాలా బాధగా అనిపిస్తోందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను చంద్రబాబు కాబినెట్ లో మంత్రిగా పనిచేశానంటూ ఆయన నాయకత్వాన్ని గుర్తు చేసుకున్నారు, అంతే కాకుండా తెలంగాణకు ఆయన చేసిన అభివృద్ధిని కూడా ఈ సందర్భంగా తలసాని గుర్తు చేసుకున్నాడు. వ్యక్తిగతంగా ఈ ఘటన నన్ను చాలా బాధించింది అంటూ ఎమోషనల్ నోట్ పెట్టాడు తలసాని.
ఎవ్వరికీ అధికారం అన్నది శాశ్వతం కాదు, పరిస్థితులను బట్టి పాలన సాగించాల్సిన అవసరం ఉన్నదన్న అర్థంలో తలసాని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.