జగదీశ్ రెడ్డి స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలను కండిస్తున్న అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. స్పీకర్ ను అవమాన పరిచెట్లు వ్యాఖ్యలు చేయడం నేను ఇంతవరకు చూడలేదు. చైర్ కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు. దళిత స్పీకర్ ను అవమాన పరిచెట్లు మాట్లాడడం సరికాదు. జగదీశ్ వ్యాఖ్యల పై ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశంపై చర్చిస్తున్నారు. స్థాయిని తగ్గించి వ్యంగ్యంగా మాట్లాడి జగదీశ్ రెడ్డి స్పీకర్ ను అవమాన పరిచారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవ్వరు కూడా జగదీశ్ రెడ్డి మాదిరి వ్యవహరించరు. స్పీకర్ సుప్రీం… దాన్ని ఎవరు క్వచన్ చేయలేరు. దళిత బిడ్డ పై అహంకారం తో కామెంట్స్ చేసారు. Brs అధికారం లో ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి..సంపత్ లా సభ్యత్వం రద్దు చేశారు. Tmc సభ్యురాలు నీ పార్లమెంట్ లో ఎక్సపెల్ చేశారు. ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయండి.. చర్యలు తీసుకోండి అని మంత్రి ఉత్తమ్ అన్నారు.