మంత్రులు కూడా కరెంట్ బిల్లు కట్టాల్సిందే : అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ

-

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అస్సాంలోని ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ఉన్న అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు తాను కూడా ఉపయోగించుకున్న కరెంటు బిల్లుకు డబ్బులు చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే జులై 1 వ తేదీ నుంచి ఈ నిబంధన అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానున్నట్లు హిమంత బిశ్వ శర్మ.. ట్విటర్ వేదికగా వెల్లడించారు.

అస్సాంలో వీఐపీ సంస్కృతికి తెరదించుతున్నట్లు ప్రకటించిన సీఎం.. ఇక నుంచి ఉన్నతాధికారులైనా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా.. చివరికి తానైనా.. కరెంటు బిల్లులను జేబులో నుంచే ఖర్చు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇలా చేయడం వల్ల విద్యుత్ సంస్థలు నష్టాల ఊబిలోకి కూరుకుపోకుండా ఉంటాయని.. కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై అదనపు భారం పడకుండా ఉంటుందని పేర్కొన్నారు. జులై 1 వ తేదీ నుంచి అస్సాంలోని ఉన్నత స్థాయి ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం కరెంట్‌ బిల్లు చెల్లించదని ఈ సందర్భంగా హిమంత బిశ్వశర్మ తేల్చి చెప్పారు. తమ విద్యుత్ బిల్లులను.. ఎవరికి వారు సొంత డబ్బులతోనే చెల్లించుకోవాల్సి ఉంటుందని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news