పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదం పై రాహుల్ గాంధీ రియాక్షన్ ఇదే..!

-

పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో కాంచనజంగ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ప్రమాద ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కంచనిజం రైలు ప్రమాదంలో ప్రయాణికులు చనిపోవడం చాలా బాధించింది. తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు వెంటనే కోలుకోవాలని కాంక్షించారు.

ప్రభుత్వం వెంటనే వారికి ప్రకటించిన మొత్తం ఎక్స్ గ్రేషియాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రమాద స్థలంలో రెస్క్యూ, సహాయ చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గత పదేళ్లలో రైల్వే ప్రమాదాలు పెరడగం మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యామే కారణమన్నారు. దీని ఫలితంగా ప్రయాణికుల ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోందన్నారు. ఈ ప్రమాదమే ఇందుకు నిదర్శనమన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా.. తాము నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. మోదీ ప్రభుత్వమే ఈ ప్రమాదాలకు కారణమని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news