కృష్ణంరాజు భౌతిక కాయానికి నివాళులర్పించిన ఏపీ మంత్రులు

-

కృష్ణంరాజు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు ఎపి పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమురి నాగేశ్వర రావు, సినిమాటోగ్రఫి మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్, ట్రాన్స్పోర్ట్ మంత్రి విశ్వరూప్, శ్రీ ప్రసాద్ రాజు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ..కృష్ణంరాజు అకాల మరణం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరుపున మా మంత్రుల బృందాన్ని పంపించారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ , కృష్ణంరాజు మరణ వార్త విని చాలా దిగ్భ్రాంతి చెందారని తెలియజేశారు.

ఆయన రాజకీయాలకు అతీతంగా అందరితో స్నేహ పూర్వకంగా వుండేవారని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ తరుపున మా మంత్రుల బృందం ఆయనకు ఘన నివాళులు అర్పిస్తోందన్నారు. అలాగే మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తరుపున ఆయనకు ఘన నివాళులు అర్పించేందుకు సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు మా మంత్రుల బృందాన్ని పంపించారని అన్నారు. కృష్ణం రాజు సేవలు మరువలేనివన్నారు. ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమై వుండేవారని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరుపున కృష్ణంరాజు కుటుంబ సభ్యుల కు ప్రగాఢ సానుభూతి తెలియచేసుకుంటన్నామన్నారు.

ప్రసాద్ రాజు మాట్లాడుతూ.. కృష్ణంరాజు మరణం చాలా బాధాకరమన్నారు. ఆపదలో వున్న ఎవరికైనా సహాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి కృష్ణంరాజు అని .. సూర్య చంద్రులు వున్నంత వరకు అయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా గా మిగిలిపోతారని అన్నారు. పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ.. నర్సాపురం లో ఏ గ్రామానికి వెళ్లిన ఆయన జాడలు కనిపిస్తాయని.. రాజకీయాలలో హుందా కలిగిన వ్యక్తి కృష్ణంరాజు అంటూ కొనియాడారు. ఏపి ప్రభుత్వం తరుపున, జగన్ మోహన్ రెడ్డి గారి తరపున ఆయనకు ఘన నివాళులు తెలియచేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news