చికోటి ప్రవీణ్‌ కస్టమర్లలలో తెలంగాణ, ఏపీ మంత్రులు !

-

చికోటి ప్రవీణ్‌ కస్టమర్ల లిస్ట్‌ లో ఏపీ, తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీబి ఛైర్మన్లు ఉన్నట్లు గుర్తించారు ఈడి అధికారులు.తెలంగాణకు చెందిన మంత్రితో పాటు ఏపీ మాజీ మంత్రి తో బయటపడుతున్న లింకులు.నేపాల్ వెళ్లిన కస్టమర్లలో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు గుర్తించారు. ప్రవీణ్‌ ల్యాప్‌ట్యాప్‌లో వీఐపీల బాగోతాలు గుర్తించారు ఈడి అధికారులు.చెన్నైకి చెందిన బంగారం వ్యాపారికి హవాలా ఏజెంట్‌గా చికోటి ప్రవీణ్ ఉన్నట్లు గుర్తించారు.

ఒక్కో దేశానికి ఒక్కో రేటు వసూలు చేసినట్లుగా ఈడి అధికారులు గుర్తించారు.ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్‌లో వీరి అడ్డాలు గుర్తించారు.కోల్‌కతా మీదుగా నేపాల్‌కు కస్టమర్లను తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో ప్రైవేట్ విమానానికి 50లక్షలు చెల్లించినట్లు గుర్తించారు.ఒక్కో హోటల్‌కు చికోటి ప్రవీణ్ 40లక్షలు చెల్లించాడని,కస్టమర్ల నుంచి 5లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు.ప్రవీణ్‌ రెగ్యులర్‌ కస్టమర్లు 200 మందికి పైగా ఉన్నట్లు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version