ట్రాఫిక్ కొత్త రూల్ ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుందంతే..!!

-

ఈ మధ్య ట్రాఫిక్ లో కొత్త రూల్స్ వస్తున్నాయి..కొత్త ఫైన్ లను కూడా పోలీసులు వేస్తున్నారు..కొన్ని చట్టంలో లేని రూల్స్ ను వేస్తున్నారు.మొన్నటి వరకూ బండికి లైసెన్స్‌ లేదనో, హెల్మెట్ లేదనో ఫైన్ వెయ్యడం అందరికి తెలిసిందే..ఇలా రకరకాల కారణాలతో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ఫైన్ విధించడం చూశాం. కానీ ఓ పోలీసు అధికారి మాత్రం..

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఓనర్‌కు షాకిచ్చాడు. బండిలో సరిపడా ఇంధనం లేదనే కారణంతో అతడికి జరిమానా విధించాడు. దీంతో సదరు ఓనర్ కంగుతిన్నాడు. వెంటనే అందుకు సంబంధించిన చలానా చీటీని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అతడి పోస్ట్ వైరల్‌గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..ఇందుకు సంబందించిన పూర్తి వివరాల్లోకి వెళితే..కేరళకు చెందిన బాసిల్ శ్యామ్ అనే వ్యక్తి ఎప్పటిలాగే ఈ నెల 22న తన Royal Enfield బైక్‌పై ఆఫీస్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలోనే అతడు రాంగ్ రూట్‌లో బైక్‌ను డ్రైవ్ చేయాల్సి వచ్చింది.

అది కాస్తా అక్కడే ఉన్న ట్రాఫిక్ అధికారుల కంట పడటంతో.. రాంగ్ రూట్‌లో బైక్ డ్రైవ్ చేసినందుకు రూ.250 ఫైన్ విధించారు. దీంతో చేసిన తప్పు ఒప్పుకున్న శ్యామ్.. జరిమానా చెల్లించేసి ఆఫీస్‌కు వెళ్లి పోయాడు. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత చలానా చీటీని చూసి అతడు కంగుతిన్నాడు. బండిలో సరిపడా ఇంధనం లేదనే కారణంతో తనకు ఫైన్ విధించినట్టు చలానాపై ఉండటంతో షాకయ్యాడు.దాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.అది కాస్త నెట్టింట హల్ చల్ చేస్తుంది..

ఇలాంటి రూల్ మన దేశంలో అయితే లేదు. కానీ కేరళ మాత్రం ఒక నిబంధన ఉంది. ఈ నిబంధన ప్రకారం.. ఆటో, కార్లు వంటి ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు తప్పనిసరిగా సరిపడా ఇంధనాన్ని కలిగి ఉండాలి. లేకపోతే అక్కడి అధికారులు ఫైన్ విధిస్తారు. ఇంధనం అయిపోయి వాహనాలు ఆగిపోతే ప్రయాణికులు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకొచ్చింది. అయితే ఈ నిబంధన బైక్‌కు వర్తించదు.అధికారి పోరపాటుతో చేసిన పని ఇప్పుడు దుమారం లేపుతుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version