మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం: మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా

-

మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో నాగారం అర్బన్ ఫారెస్ట్ పార్కును
ప్రారంభించారు. అనంతరం ఎనిమిదో విడత హరితహారంలో భాగంగా మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా న‌గ‌రాల‌కు, పట్టణాలకు దగ్గర్లో ఉండే రిజర్వ్‌ ఫారెస్ట్ ప్రాంతాల్లో అర్బన్ లంగ్‌ స్పేస్‌లుగా అర్భన్ ఫారెస్ట్ పార్క్‌ల‌ను అభివృద్ధి చేస్తున్నామ‌న్నారు. మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు హైదరాబాద్‌కు నలువైపులా వీటిని ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు.

Six urban forest parks in Hyderabad to be inaugurated on Thursday

అవుట‌ర్ రింగ్ రోడ్డుకు 7 కిలోమీట‌ర్ల దూరంలో మ‌హేశ్వరం మండలం పెద్దపులి నాగారంలో 556. 69 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.8.17 కోట్ల వ్యయంతో నాగారం అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ను అభివృద్ధి చేశామన్నారు. ఎంట్రీ ప్లాజా, విజిట‌ర్స్ పాత్వే, స‌ఫారి ట్రాక్, గజేబో, వాచ్ ట‌వ‌ర్, గ్యాప్ ప్లాంటేష‌న్, అటవీ ప్రాంతం అంతా రక్షణ గోడ (చైన్ లింక్ ఫెన్సింగ్, సీ త్రూ వాల్), బోర్ వెల్, పైప్ లైన్, ఇత‌ర‌ సౌకర్యాల‌ను క‌ల్పించామని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news