మైనర్ బాలిక రేప్.. బాత్ రూంలో ప్రసవం

20 ఏళ్ల ఓ యువకుడి కారణంగా ఓ మైనర్‌ బాలిక గర్భం దాల్చి… టాయిలెట్‌ లో శిశువును ప్రసవించింది. ఈ దారుణమైన ఘటన.. కేరళ లోని కొచ్చిలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… కేరళ రాష్ట్రంలోని కొచ్చి కి చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు.. ఓ మైనర్‌ బాలికను దారుణంగా రేప్‌ చేశాడు. అయితే.. ఈ లైంగిక దాడి కారణంగా ఆ మైనర్‌ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం తెలియం ఆ బాలికకు తెలియలేదు. అయితే.. కడుపు నొప్పి అంటూ తన తల్లికి చెప్పింది.

దీంతో తన కూతురు కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లింది ఆ తల్లి. అయితే.. ఆ ఆస్పత్రిలో వెయిటింగ్‌ బాగా ఉంది. ఈ నేపథ్యం లోనే ఆ మైనర్‌ బాలికకు కడుపు నొప్పి బాగా అయింది. దీంతో ఆ ఆస్పత్రిలోని టాయిలెట్‌ లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఓ పిండం బయట పడింది. ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా డాక్టర్‌ దగ్గరికి వచ్చింది బాలిక. అయితే… ఆస్పత్రి సిబ్బంది చూసి… పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ మైనర్‌ బాలికను విచారించారు. దీంతో లైంగిక దాడి ఘటన ను వెల్లడింది. ఇక ఆ బాలిక తల్లి ఫిర్యాదు తో ఆ యువకుడిపై కేసు నమోదు చేసి… అరెస్ట్ చేశారు పోలీసులు.