కరోనా ఏ రంగంలో ఎంత నష్టం మిగిల్చింది ఏంటీ అనేది తెలియదు గాని విద్యా వ్యవస్థలో మాత్రం కరోనా కారణంగా అనేక నష్టాలు జరిగాయి అనే మాట మాత్రం అక్షరాలా నిజం. విద్యా వ్యవస్థలో మాత్రం అనేక మార్పులు వచ్చాయి. కొందరి జీవితాలను కూడా కరోనా నాశనం చేసింది. తాజాగా కృష్ణా జిల్లాలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో పెళ్లి అయిన 12 రోజులకే వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

బాత్రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది రాజేశ్వరి అనే వివాహిత. రాజేశ్వరి స్వగ్రామం మైలవరం మండలం గణపవరం అని పోలీసులు తెలిపారు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉండగా లాక్ డౌన్ కారణంగా చదువు మానిపించి తల్లి తండ్రులు వివాహం చేసారు. ఇష్టం లేని వివాహం చేశారు అనే కారణం తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటుంది అని పోలీసులు భావిస్తున్నారు.