హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో కొన్ని విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించి విద్యార్థులు తరగతులకు హాజరవ్వడాన్ని మరో వర్గం విద్యార్థుల వ్యతిరేఖించి… కాషాయ కండువాలతో రావడం ఇరువర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది. దీనిపై ఇటీవల కర్ణాటక హైకోర్ట్ కీలక తీర్పు చెప్పింది. హిజాబ్ ముస్లిం మతంలో తప్పనిసరి సంప్రదాయం కాదని తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఈ తీర్పును సుప్రీం కోర్ట్ లో ఛాలెంజ్ చేశారు.