తెలంగాణ మంత్రి ఎర్రబెల్లికి తప్పిన ముప్పు.. వాహనం ధ్వంసం

-

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు… ఎర్రబెల్లి దయాకర్ రావు కు పెద్ద ప్రమాదం తప్పింది. వేగంగా వెళుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనానికి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ దమ్ము చక్రాలు తగిలాయి. ఈ ఘటన జరగడం తోనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనం పూర్తిగా ధ్వంసమైంది.

ఈ ఘటన ఆయన జిల్లాలోని… వెలిశాల మరియు కొడకండ్ల మధ్యలో చోటు చేసుకుందని సమాచారం అందుతోంది. అయితే అదృష్టవశాత్తు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్ రావు క్షేమంగా ఉన్నారని సమాచారం అందుతోంది. అయితే ఈ సంఘటనలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ట్రాక్టర్ తప్పిదం ఉన్నట్లు అర్థం అవుతోంది. ఇక ప్రమాదంపై వివరాలు తెలియాల్సి ఉంది. ఇక అటు ఎర్రబెల్లి దయాకర్ రావు క్షేమంగా బయట పడటంతో పార్టీ కార్యకర్తలు, ఆయన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news