తిరుపతి పట్టణంలో కోవిడ్ పరీక్ష నివహిస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం బట్టబయలైంది. కరోనా సెంటర్స్ లో డిటిపి ఆపరేటర్లు లేకపోవడంతో 236 మంది కోవిడ్ రోగుల వివరాలు తప్పుగా నమోదవడం జరిగింది. అలాగే ఎవరైతే పరీక్షలు చేయించుకున్న వారికి సకాలంలో కరోనా విభాగం నుండి సమాచారం ఇవ్వకపోవడంతో ఈ పొరపాటు జరిగింది. ఇందులో చాలామంది ఫోన్ నెంబర్లను కూడా తప్పుగా సమాచారం ఇవ్వడంతో పాటు కొంతమంది ఫోన్ నెంబర్లను కూడా అక్కడి సిబ్బంది నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో అక్కడి సిబ్బంది తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి పరీక్షలు చేయించుకున్న ప్రజలు తప్పుడు నెంబర్లు ఇచ్చారని ప్రజలపై ఆరోపణలు చేస్తున్నారు.
అందులో ఇప్పటికే చాలామంది క్వారంటైన్ లో చేరారని పలువురిలో తమకు పాజిటివ్ వచ్చిందా..? లేదా అని టెన్షన్ పడుతున్నారు. మరికొందరైతే ఎలాంటి సమాచారం వస్తుందో అని భయం భయంగా గడుపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ డిటిపి ఆపరేటర్ లను నిర్మించకపోతే ఇలాంటి సమస్య మరింతగా కష్టమయ్యే పరిస్థితి నెలకొని ఉంది. ఏదేమైనా ఇంత మంది వివరాలను తప్పుగా నమోదు చేయడం, మరికొంత మంది వివరాలను పూర్తిగా నమోదు చేయకపోవడంతో సిబ్బంది నిర్లక్ష్యం కాస్త బయటపడింది.