కాంగ్రెస్ నేత మిస్సింగ్.. ఆందోళనలో అభిమానులు..!

ఇటీవలే కర్ణాటకలో కాంగ్రెస్ సీనియర్ నేత అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. మాజీ మేయర్ కర్ణాటక కాంగ్రెస్ నేత సంపత్ రాజ్ అదృశ్యమయ్యారు. దీంతో అటు పార్టీలో ఇటు అభిమానుల్లో కూడా ఆందోళనలో మునిగిపోయారు. అసలు మాజీ మేయర్ కర్ణాటక కాంగ్రెస్ నేత సంపత్ రాజ్ కి ఏమై ఉంటుంది అన్నది ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్ ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకొని కోలుకున్నారు.

కరోనా వైరస్ బారి నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్ రాజు అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. అయితే ఇలాంటి ముందస్తు సమాచారం అందించకుండా సంపత్ రాజును డిశ్చార్జి చేసినందుకు ఆసుపత్రి సిబ్బంది కి నోటీసులు ఇచ్చారు పోలీసులు. కాగా ఇటీవలే బెంగళూరులో జరిగిన హింసాత్మక అల్లర్ల కేసులో సంపత్ రాజు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండటం గమనార్హం. దీంతో ఎవరు ఆయనను కిడ్నాప్ చేసి ఉంటారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.