మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని రోడ్డెక్కిన మహిళలు

-

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంచి నీళ్లు బాగా వచ్చాయని.. ఇప్పుడు అస్సలు రావడం లేదని మహిళలు రోడ్డు ఎక్కారు. నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదని బిందెలతో రోడ్డెక్కిన మహిళలు.  నల్లగొండ మండలం చెన్నారం గ్రామంలో నెల రోజులుగా త్రాగునీరు రాకపోవడంతో రోడ్డెక్కిన మహిళలు..  దీంతో నల్గొండ కనగల్ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నీళ్లకు ఇబ్బందులు లేవని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ సమస్య వచ్చిందని పేర్కొంటున్నారు. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఎండా కాలంలో మరేలా ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు రోడ్డు ఎక్కడం చూసి..  స్థానికులు ప్రభుత్వం పై కాస్త ఆగ్రహంగా ఉన్నారు. కేసీఆర్ మిషన్ భగీరథ తీసుకొచ్చి నీటి కష్టాలు తీర్చాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత నీటి కష్టాలు మాత్రం తప్పడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news