ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై కోటంరెడ్డికి ఎమ్మెల్యే బాలయ్య ఫోన్…!

-

నెల్లూరు జిల్లాలోని కావలిలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై వివాదం నెలకొన్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పదించారు. అయితే ఎన్టీఆర్ విగ్రహం టచ్ చేయాలంటే.. వైసీపీ నాయకులకు వణుకు పుట్టేలా మన చర్యలు ఉండాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశించారు. తాజాగా దీనిపై నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఈ ఘటనపై స్పందించారు. కావలి టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డికి బాలయ్య ఫోన్ చేశారు. కావలిలో ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే విగ్రహం నిర్వహించాలని ఆయనకు సూచించారు. కాగా బాలయ్యకు కోటంరెడ్డి అత్యంత ఆప్తుడన్న విషయం విదితమే.

Balakrishna
Balakrishna

అంతకు ముందు కోటంరెడ్డి ఆధ్వర్యంలో బాలయ్య అభిమానుల సమావేశమయ్యారు. ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై భవిష్యత్తు కార్యాచరణకు పూనుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ‘రెడ్ జోన్’ అని అడ్డుకున్నారు. దీంతో ఫ్యాన్స్ వర్సెస్ పోలీసులుగా పరిస్థితులు మారాయని తెలుస్తోంది. మరింత మంది పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలియవచ్చింది. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news