కాలం చెల్లిన… గోవధ చట్టాన్ని ఎత్తివేయాలి : వైసీపీ ఎమ్మెల్యే సంచలనం

కర్నూలు : ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవధ చట్టాన్ని ఎత్తివేయాలని…గోవధ చట్టం అమలు సాధ్యం కాదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో కాలం చెల్లిన చట్టాల్లో గోవధ చట్టం ఒకటి… అని బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ , భజరంగధల్ బక్రీద్ పండుగ రోజు గోవధ చట్టాన్ని వివాదంగా మారుస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

ప్రపంచంలో ఎక్కడా గోవధ చట్టం అమలులో లేదని.. లౌకిక దేశంలో గోవు పూజించేవారికి పూజించే వస్తువు…తినే వారికి ఆహార వస్తువు అని పేర్కొన్నారు. ప్రజల ఆహార అలవాట్లపై నిషేధం విధించడం పౌరుని ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనన్నారు… వైసీపీ ఎమ్మెల్యే గా చెప్పడం లేదు…లౌకికవాదిగా చెప్తున్నానని స్పష్టం చేశారు. మునులు గోవులను తిన్నట్టుగా తాను విన్నానని…మైనార్టీలపై గోవధ చట్టం పేరుతో రాద్ధాంతం చేయడం కరెక్టు కాదని తెలిపారు. గోవధ నియంత్రణ యంత్రాంగం ఏ ప్రభుత్వం దగ్గర లేదన్నారు. కాలం చెల్లిన చట్టాలలో గోవధ నిషేధ చట్టం ఒకటి అని… గోవులు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆహార వస్తువులుగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు..