ఏపీలో గ్రామ వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తున్న సంగతి తెలిసిందే. పింఛన్ల పంపిణీ ఇతర కార్యక్రమాల్లో గ్రామ వాలంటీర్లు ప్రజలకు ఎంతగానో సహకరిస్తున్నారు. కరోనా వేళ కూడా గ్రామ వాలంటీర్ లు ప్రజల్లో ఉండి ప్రభుత్వ కార్యక్రమాలను వారి వద్దకు చేర్చారు. అయితే వాలంటీర్ల కష్టాన్ని గుర్తించిన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కీలక నిర్ణయం తీసుకున్నారు.
సీతానగరం, కోరుకొండ, రాజానగరం మండలాల్లో 1,475 మంది వాలంటీర్లకు బీమా ప్రీమియంను తానే చెల్లిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ బీమా ద్వారా ఏదైనా ప్రమాదం సంభవించి మరణించినా లేదంటే అంగవైకల్యం ఏర్పడినా లక్ష రూపాయల పరిహారం ఇస్తారు. అదే విధంగా ప్రమాదం జరిగితే 50000 పరిహారాన్ని ఇవ్వనున్నారు. ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయం పై గ్రామ వాలంటీర్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.