పవన్ కళ్యాణ్ సీఎం అయితే మేం సపోర్ట్ చేస్తాం – వైసీపీ ఎమ్మెల్యే

-

నరసరావు పేట అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మేం కూడా సపోర్ట్ చేస్తామంటూ హాట్ కామెంట్స్ చేశారు నరసరావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.

చంద్రబాబును తలకి ఎక్కించుకోవడానికి పవన్ కళ్యాణ్ పాట్లు పడుతున్నాడని నిప్పులు చెరిగారు. నిజం గా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా అయితే మేము కూడా సపోర్ట్ చేస్తామంటూ పేర్కొన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. అయితే, నరసరావు పేట అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు… ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news