జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తాడేపల్లి ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తీవ్ర విమర్శలు కురింపించారు. సినిమా పరిశ్రమ ఏమీ పవన్ కళ్యాణ్ సొంత సొత్తుకాదు.. చిరంజీవికి ఉన్న హూందాతనం పవన్ కళ్యాణ్ కు లేదని అన్నారు. సినిమా పోర్టల్ అన్ లైన్ వ్యవస్థ కు చిరంజీవి పూర్తి మద్దతు ఇస్తానన్నారని తెలిపారు. యుద్ధానికి సిద్ధం అంటూ కార్యకర్తలను రెచ్చగొడుతూ, తాలిబన్ పంథా పరిపాలనను జనసేన కోరుతున్నట్లు కనిపిస్తుందని సత్యనారాయణ విమర్శించారు.
సినిమా పరిశ్రమలో అవినీతిని అరికట్టేందుకు కొత్త ఆన్ లైన్ వ్యవస్థ పనికొస్తుందని చెప్పారు. జీఎస్టీ విధానంపై ప్రధానిని ప్రశ్నించి తర్వాత మా ప్రభుత్వ పనితీరును ప్రశ్నించాలని ఎమ్మెల్యే హితవు పలికారు. స్థానికసంస్థల్లో టీడీపీ జనసేనది అక్రమపొత్తంటూ తీవ్రంగా మండిపడ్డారు. జనసేన ఒక్క కాపులకే పరిమితమా…కాపు అంటే నమ్మకానికి ప్రతిరూపం. కాపులకు మచ్చ తెచ్చే పార్టీ జనసేన అంటూ సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు.