కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో ముగిసిన కేసీఆర్ సమావేశం.. వీటి పైన చర్చ

-

ఢిల్లీః కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కాసేపటి క్రితమే సిఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. సుమారు 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది, అయితే ఈ సమావేశం పైతెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడారు. ధాన్యం కొనుగోలు పై ప్రధానంగా చర్చించామని.. గతంలో లాగా కొనలేమని కేంద్రం రాత పూర్వకంగా రాష్ట్రానికి తెలిపిందన్నారు.

FCI ద్వారా కేంద్రం కొనుగోలు చేసేలా ముఖ్యమంత్రి రెండు రోజులుగా ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రి నుంచి ఇంకా స్పష్టత రాలేదని.. మరో రెండు మూడు రోజుల సమయం కావాలని కేంద్ర మంత్రి కోరారని వెల్లడించారు. తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి ఐదు రెట్లు పెరిగిందని.. కేంద్ర ప్రభుత్వం వద్ద వచ్చే ఐదేళ్ల వరకు గోడౌన్లు ఖాళీ లేవని వెల్లడించారు.

రైతుల నుంచి కొన్నా పంటను నిల్వ చేసే పరిస్థితి లేదని.. విదేశాలకు ఎగుమతి చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని సీఎం కోరారని పేర్కొన్నారు. దేశమంతటా పంటమార్పిడి చేపట్టాలని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ సూచించారని.. పంజాబ్ లో సైతం పంటమార్పిడి చేస్తున్నారని గుర్తు చేశారన్నారు. రెండు రోజులలో సమస్య కు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news